Podcasts by Category

TALRadio Telugu

TALRadio Telugu

Touch A Life Foundation

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

520 - ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13
0:00 / 0:00
1x
  • 520 - ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13

    ఆహారం కేవలం ఆకలి తీరే మార్గం కాదు. బలాన్ని అందించడమే దాని ఉపయోగం కాదు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మీదా, మనసు మీదా ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆన్ లైన్ ఆర్డర్లు ఓ అలవాటుగా మారుతున్న నేటి కాలంలో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. ఓ సౌలభ్యంగానో, సౌకర్యంగానూ ఉన్న ఈ అలవాటు వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాదు. ఒక రోజును మొదలుపెట్టడం నుంచి సరైన రీతిలో ఆహారం ఎలా ఉండాలో విందాం! ఆహారం ఓ ఔషధం అనే పెద్దల మాటను గుర్తుచేసుకుందాం.


    Food is not just a means to satiate hunger. Its purpose is not merely to provide strength. The food we consume has a definite impact on our body and mind. In today's era, where online orders have become a habit, we must remember this fact. So, where is the mistake happening? What is the harm caused by this convenient habit? Let's explore these aspects. Moreover, let's learn how to start a day with the right kind of food! Let's remember the elders' saying that food is medicine


    Host : Bharathi


    #TALRadioTelugu #Bharathi #onlinefood #foodandhealth #nutrition #touchalife #talradio #talpodcasts

    Fri, 31 May 2024 - 14min
  • 519 - ప్రతి ఊరి పేరూ… చరిత్ర చెప్పే కబురు | వాండ్రంగి కొండలరావు | మన రచయితలు - 55

    కాకి అనే ఊరి పేరు వినిపిస్తే… కాస్త హాస్యంగా తోస్తుంది. కానీ దాని వెనకాల ఓ ఆశ్చర్యకరమైన కథ ఉందని తెలిస్తే. దీర్ఘాసి లాంటి ఊరి పేర్ల వెనక గొప్ప చరిత్ర కనిపిస్తే! మనం గమనించాలే కానీ ప్రతీ ఊరి పేరూ ఓ కథ చెబుతుంది. ప్రతి గ్రామనామం వెనకా అబ్బురపరిచే విశేషమేదో ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వాతావరణం, జీవనశైలి, పశుపక్ష్యాదులు… ఇలా ఓ ఊరి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. వీటిని పరిశోధించి, గ్రంథస్తం చేయడమే తన వ్యాపకంగా అలవర్చుకుని అందులో అరుదైన ప్రయాణం చేస్తున్నారు వాండ్రంగి కొండలరావుగారు. ఆయనతో మన రచయితలు కార్యక్రమం!


    Toponymy is rare subject that deals with names of places. Toponymy believes that every name is unique and has a history hidden behind it. Vandrangi Kondalrao who is a teacher by profession and journalist by passion has started a unique journey in Toponymy and is making commendable impact.


    Host : K L Surya


    #TALRadioTelugu #manarachayitalu #vandrangikondalrao #touchalife #talradio

    Thu, 30 May 2024 - 27min
  • 518 - సమాజంతో స్నేహం ...సేవతో సంతోషం ! - మల్లికార్జున్ | స్ఫూర్తి కిరణాలు

    మల్లికార్జున్… కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి స్వచ్ఛంద సేవ చేసేవారు. చదువు అయిపోయినా, కెరీర్ మొదలైనా… ఇతరులకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తిని మర్చిపోలేదు. SERUDS పేరుతో కర్నూలులో వృద్ధులు, పిల్లలు, మహిళలు… ఇలా అన్ని రంగాలవారికీ అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే కాదు, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలాగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు అయిదు వేల కుటుంబాలు ఈ సంస్థ వల్ల ప్రభావితం అయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ అరుదైన వ్యక్తినీ, తన ప్రయాణాన్ని వినేద్దాం.


    Here is a conversation with Mallikarjun, Founder of SERUDS- Sai Educational Rural & Urban Development Society based in Kurnool District. SERUDS has been relentlessly striving to help the needy women, children and elders. It is not only providing them, much needed care but also supporting them in building their own livelihood. It is estimated that SERUDS has impacted almost 5000 families. Here is its inspiring journey.


    Host : K L Surya


    #TALRadioTelugu #SpoorthiKiranalu #MalliKarjun #Inspiring #SERUDS #touchalife #talradio #talpodcasts

    Mon, 27 May 2024 - 27min
  • 517 - Tongue thrusting అంటే ఏమిటి ? | DenTAL Care - 11

    Tongue thrusting అనే సమస్య అసలు మనకి ఉందని కూడా చాలామందికి తెలియదు. ఐతే ఈ సమస్య వల్ల ఇంకా బోలెడన్ని నోటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మరింత వివరంగా తెలుసుకుందాం Dr. హరీష్ తెన్నేటి గారి నుండి, ఈ వారం సంచికలో!


    Tongue thrusting is an oral issue that most of us fine even know we are experiencing this. This may lead to many more oral and other health problems if left untreated. Know more about Tongue thrusting from Dr. Harish Tenneti in this week’s episode!


    Host: Jayasree



    Expert: Dr.Harish Tenneti



    Dr. Harish Contact Details:

    Mobile number: 9182674723

    Website:https://www.violetera.in/


    #TALRadioTelugu #DenTALCare #TongueThrusting #OralHealth #DentalHealth #TouchALife #TALRadio #TALPodcast

    Sat, 25 May 2024 - 30min
  • 516 - వ్యక్తిగత శుభ్రతతో మానసిక ఆరోగ్యం | ఓ మంచి మాట - 12

    చాలా మురికిగా దుర్గంధభూరితంగా ఉన్న గదిలోకి మీరు అడుగుపెట్టారే అనుకోండి… అక్కడ మీకు ప్రశాంతత దక్కుతుందా. చింపిరి జుట్టుతో, నోటి దుర్వాసనతో ఉన్న వ్యక్తిని మొదటిసారి కలిశారే అనుకోండి… తన మీద మీకు సదభిప్రాయం కలుగుతుందా! స్పష్టంగా లేదనే జవాబు చెబుతాం కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, మన మనసు మీద తెలియకుండానే ప్రభావం చూపిస్తాయి. పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ఆహ్లాదం కలిగిస్తాడు. ఇది డబ్బుకో, స్తోమతకో సంబంధించిన విషయం కాదు. మన అలసత్వాన్ని, అశ్రద్ధను బయటపెట్టే అంశం. చాలా చిన్న విషయమే. కానీ చాలా ప్రభావం చూపించే కారణం. అందుకే ఈ వారం మంచి మాటలో… ఈ విషయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు


    Imagine stepping into a filthy, foul-smelling room... Would you feel at peace there? Or meeting someone for the first time who has unkempt hair and bad breath... Would you have a good impression of them? Clearly, the answer is no. This is because our surroundings subtly affect our mind. A clean person creates a pleasant atmosphere. This isn't about money or status; it's about revealing our laziness and negligence. It's a small matter but has a significant impact. That's why, in this week's Good Word segment, our expert Bharati will share more interesting insights on this topic.


    Host : Bharathi


    #TALRadioTelugu #CleanlinessMatters #FirstImpressions #MindfulLiving #ExpertAdvice #TALRadio #TALPodcast


    Fri, 24 May 2024 - 09min
Show More Episodes