Filtra per genere

Swara Madhuri

Swara Madhuri

తెలుగు సుస్వరాల రస ఝరి.........

ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటి‌ఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..

42 - ఎన్నికలు బాబోయ్ ఎన్నికలు
0:00 / 0:00
1x
  • 42 - ఎన్నికలు బాబోయ్ ఎన్నికలు

    ఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. 

    Fri, 03 May 2024 - 17min
  • 41 - అనుభవమే అన్ని నేర్పిస్తుంది.....

    ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.

    Sun, 18 Feb 2024 - 03min
  • 40 - చెరగని యశస్వి -కళా తపస్వి

    తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్‌. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్‌ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్‌ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. చక్కటి సామాజిక స్పృహ, మూర్తీభవించిన మానవతా విలువలతో తెలుగు సినిమాకు ఓ ప్రబంధ గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్‌. తెలుగు సినీ చరిత్రలో ఆయనది సువర్ణాధ్యాయం. సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా కె. విశ్వనాథ్‌ సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు ఆచంద్రతారార్కం ప్రభవిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాల ద్వారా చాటిన విలువలు రాబోవు తరాల్ని కూడా ప్రభావితం చేస్తాయి

    Wed, 08 Feb 2023 - 10min
  • 39 - ఎప్పటికీ అంతు పట్టని మోనాలిసా .... అసలు ఎవరబ్బా ...????

    ఈ రోజుకి కూడా మోనాలిసా ఎవరో తెలియదు? అంటే లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పటికీ ఒక రహస్యం. మోనాలిసా లియోనార్డో తప్ప మరెవరో కాదని ఒక థియోరి చెబుతోంది.

    Thu, 06 Oct 2022 - 04min
  • 38 - పాటల వెన్నెల సిరివెన్నెల

    తెలుగు సినీ సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టించిన సిరివెన్నల కలం ఇంకిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి గళం చెంతకే కలం వెళ్ళిపోయింది.

    Fri, 03 Dec 2021 - 09min
Mostra altri episodi